Festival Fair-2017
 

> News & Events
> Festival Fair-2018
> Festival Fair-2017
> Festival Fair-2016
> Festival Fair-2015
> Festival Fair-2014
> Festival Fair-2013
> Festival Fair-2012
> Festival Fair-2011
> Festival Fair-2010
> Festival Fair-2009
> Festival Fair-2008
> Press Releases


 
 
  Latest News Dt: April 14th' 2017 :

Grandly Celebrated


Lord Sri LNS Swami Brahmothsavamulu 2017
( BEJJANKI Lord Sri LNS Festival Fair-2017)


3rd' April 2017(Monday) to 18th' April 2017 (Tuesday)


This year Brahmothavamulu has celebrated marvelously,
Devotees are enlightened with god's blessings in

Programs of Fair:

1). Sri LNS Swami "Kondapaiki VemcheyuOn April 3rd' 2017 (Monday)
Time: 4.00 pm.

1). Sri LNS Swami "KalyanothsavamOn April 7th' 2017 (Friday)
Time: 6.15 pm

2). Sri LNS Swami ShakhatothsavamOn April 11th' 2017 (Tuesday)
Time: From 3.30 pm

3). Sri LNS Swami "Rathothavamu" On April 13th' 2017 (Thursday)
Time: 4.00 am (*April 12th' Wednesday Night and April 13th' Thursday Early Morning).

Eenadu Local News on 14 April 2017:

పులకించిన ఏకశిల.. మురిసిన భక్తజనం..
నేత్రపర్వంగా లక్ష్మీ నరసింహుడి దివ్య రథోత్సవం 

బెజ్జంకి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో ఏకశిలపై కొలువుదీరిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామి వారి దివ్య రథోత్సవం గురువారం కనులపండువగా జరిగింది. వేలాది భక్తుల రాకతో దారులన్నీ బెజ్జంకి వైపే చందంగా ఆలయ సన్నిధి జనసంద్రమైంది. మామిడి తోరణాలు, విభిన్న రకాల పూలు, రంగులతో అందంగా ముస్తాబు చేసిన భారీ రథంపై స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆలయ గుట్ట చుట్టూ రథోత్సవాన్ని నిర్వహించారు. దివిటీలు కాలుస్తూ, ఎదురు కోళ్లు, కానుకలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు చెల్లించారు. తాళ్లతో రథాన్ని లాగుతూ భక్తి తన్మయత్వంతో పరవశించారు. ‘బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా.. గోవిందా’ నామస్మరణతో ఆలయ ఆవరణను మార్మోగించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తుల దర్శనార్థం రథంపై స్వామి వారి ఉత్సవమూర్తులను అందుబాటులో ఉంచగా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు మొక్కులు చెల్లించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వరుసలో నిలుచునేందుకు భక్తుల మధ్య తీవ్ర రద్దీ నెలకొనడం, వేలాదిగా భక్తులు తరలి రావడంతో పోలీసులు, వలంటీర్లు తాళ్లు కట్టి బందోబస్తు నిర్వహించారు. మరోవైపు గుట్టపై ఉన్న ఆలయానికి బుధవారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తగా క్యూలైన్లు కిక్కిరిశాయి. కోనేరులో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ఉత్తరముఖంగా స్వామి వారిని దర్శించుకొని ఒడిబియ్యం, ముడుపులు సమర్పించారు. దివ్య రథోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణ భక్తులు, వాహనాలతో నిండిపోయింది. దుకాణాలు విస్తరించడంతో షామియానాలు, చలువ పందిళ్లతో ఆలయ వీధులు సందడిగా మారాయి. జాతరతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై అభిలాష్‌ ఆధ్వర్యంలోని సిబ్బంది, వలంటీర్లు బందోబస్తు, పెట్రోలింగ్‌ నిర్వహించారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు, పలు పార్టీల నాయకులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. మండల కేంద్రానికి చెందిన రెండు సంవత్సరాల పాప మనువజ్ఞ రథం వద్ద తప్పిపోగా పోలీసులు మైకులో వివరాలు తెలిపి కొద్ది నిముషాల్లో తల్లిదండ్రులకు అప్పగించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ నర్సయ్య, వైస్‌ ఛైర్మన్లు లక్ష్మణ్‌, కవిత, ప్రధాన అర్చకుడు మధుసూదనాచార్యులు, శ్రీ వాత్సవ చార్య, సభ్యులు పాల్గొన్నారు.



 
 
Home l About Temple l Photo gallerry l News & Events l Donars l Site Map l Contact Us l Other Info
 
  All rights reserved © 2007 www.karimnagartourism.com, Email Id: srilnswamy.bjk@gmail.com  
Festival Fair-2014 Festival Fair-2013 Festival Fair-2012 Festival Fair-2011 Festival Fair-2010 Festival Fair-2009 Festival Fair-2008 Press Releases
About Temple About Temple -
Telugu Version
Conserve, Swamivariki Seva Other temples in
Karimnagar Dist.
Overview